‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఇది సాంకేతిక విజయం. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ నాకు ఇచ్చిన దర్శకుడు అప్సర్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’ అని అశ్విన్‌బాబు అన్నారు. ఆయన హీరోగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వరరెడ్డి నిర్మించిన చిత్రం ‘శివంభజే’.
ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్విన్‌బాబు మాట్లాడారు. టెక్నీషియన్స్ అందరూ ప్రాణంపెట్టి చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని దర్శకుడు చెప్పారు. హీరో అశ్విన్, నిర్మాత మహేశ్వరరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.