అశ్విన్ కథానాయకుడిగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మించిన ‘శివం భజే’ చిత్రం ఆగస్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ వారు విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఆనందం వక్తం చేశారు.
క్రైమ్, మర్డర్ మిస్టరీతో కూడిన ఇన్విస్టిగేటివ్ డ్రామా ఇదని, ఈ అంశాలతోపాటు మైథాలజీతో కూడిన ఓ ఆసక్తికరమైన పాయింట్ కూడా ఇందులో ఉందని మేకర్స్ చెబుతున్నారు. అర్బాజ్‌ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీశర్మ, సాయిధీన, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: వికాస్ బడిస.