Shivakarthikeyan anudeep movie | రజినీకాంత్, కమల్‌హాసన్ వంటి అగ్ర హీరోలు అప్పట్లో తెలుగు దర్శకులతో ద్విభాషా చిత్రాలను చేసేవారు. తెలుగు తమిళంలో ఏకకాలంలో ఈ చిత్రాలు వచ్చేవి. మళ్లీ ఇప్పుడు ఇదే కోవలో పలువురు తమిళ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే తమిళ స్టార్ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇప్పుడు తాజాగా మరో హీరో ద్విభాష చిత్రాన్ని మొదలు పెట్టాడు.
గతేడాది వచ్చిన వరుణ్ డాక్టర్ సినిమాతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ఈయన జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలోని కారైకూడిలో ఘనంగా జరిగాయి. ‘ఎంటర్టైనమెంట్ జర్నీ మొదలైంది. తెలుగు తమిళ ద్విభాషా చిత్రం కారైకూడిలో అధికారిక పూజా కార్యక్రమాలతో ప్రారంభించాం. రెగ్యులర్ షూటింగ్ మొదలైంది’ అంటూ మేకర్స్ మూవీ లాంఛింగ్ ఫోటోలను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, సురేష్‌బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Versatile Actor Siva karthikeyan, Director Anudeep KV, SVC LLP, Suresh Productions, Shanthi Talkies #SK20 Launched, Regular Shoot Too Commenced 🪔🎬@Siva_kartikeyan @anudeepfilm @MusicThaman @manojdft @SVCLLP @SureshProdns @ShanthiTalkies #SK20Begins 💫 #Sivakarthikeyan pic.twitter.com/GN75Qm84Gc
— Sreedhar Marati (@SreedharSri4u) February 10, 2022