కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు తీరని దుఃఖంలో ఉన్నారు.పునీత్ లేడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే తమ్ముడు చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత శివ రాజ్ కుమార్ ఒక మీడియా సంస్థ ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ్ముడు మృతితో కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. -చదవండి : ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు అంటున్న వెంకటేష్
ఎన్టీఆర్ గురించి కూడా శివ రాజ్ కుమార్ ప్రస్థావించాడు. ఆ రోజు ఎన్టీఆర్ నా వద్దకు వచ్చి నేనున్నా అన్న మీకు అంటూ ధైర్యంగా నిలిచాయని శివ రాజ్ కుమార్ అన్నాడు. ఎన్టీఆర్ పై తనకు ఉన్న అనుబంధం మరియు అభిమానంను శివ రాజ్ కుమార్ తెలియజేశారు. కాగా, పునీత్ రాజ్ కుమార్ మృతి వార్త తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలో పునీత్ రాజ్ కుమార్ మృత దేహంను చూసి ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్ ను ఎన్టీఆర్ ఓదార్చారు.
ఎన్టీఆర్ కు కన్నడ సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ కోసం ఎన్టీఆర్ ఒక పాటను కూడా కన్నడంలో పాడి అక్కడి వారిని తన గొంతుతో ఆకట్టుకున్నాడు. ఈ పాట తర్వాత పునీత్ మరియు ఎన్టీఆర్ ల మద్య బంధం మరింతగా పెరిగినట్లయ్యింది. ఈ బంధం ఇప్పటిది కాదని.. అప్పటి రాజ్ కుమార్ మరియు సీనియర్ ఎన్టీఆర్ నుండి కొనసాగుతూ ఉంది.
"నేనున్నాను అన్నా మీకు" – ఎన్.టి.ఆర్
— Milagro Movies (@MilagroMovies) November 11, 2021
శివరాజ్ కుమార్ @NimmaShivanna
గారిని పరామర్శించిన ఎన్.టి.ఆర్@tarak9999 @PuneethRajkumar pic.twitter.com/Qijeqlagc9