Shiva Nirvana | టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు శివ నిర్వాణ. కథను నమ్మి సినిమా చేసే అతికొద్ది మంది దర్శకుల్లో ఒకడు. చివరగా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయినా.. మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏం ప్రకటించలేదు శివ నిర్వాణ. మరి ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడంటూ చర్చించుకుంటున్న వారి కోసం ఆసక్తికర వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ డౌటు.. ఇంకెవరో కాదు టాలీవుడ్ యాక్టర్ రవితేజ.
రవితేజ అంటే మాస్ అప్పీల్, ఎనర్జిటిక్ డ్యాన్స్, యాక్షన్, కామెడీ, రొమాన్స్..ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలిసిందే. శివనిర్వాణతో రవితేజ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా తెరకెక్కించనున్నట్టు ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ సారి రవితేజ రూటు మార్చి థ్రిల్లర్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. ఇప్పటిదాకా లవ్ స్టోరీలతో ఇంప్రెస్ చేసిన శివనిర్వాణ థ్రిల్లర్ జోనర్లో చేస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. శివ నిర్వాణ, రవితేజ ఇద్దరు తమ రూటులను మార్చి ఒకే ప్రాజెక్టుకు పనిచేయడం మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి.
మైత్రీ మూవీ మేకర్స్, రవితేజ కాంబోలో అమర్ అక్బర్ ఆంటోనీ రాగా.. ఈ ప్రొడక్షన్ హౌజ్‌లో శివ నిర్వాణ ఖుషి మూవీ చేశాడు. త్వరలోనే శివ నిర్వాణ-రవితేజ- మైత్రీ కాంబో సినిమా అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇదే నిజమైతే ఈ క్రేజీ కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందన్నది చాలా ఆసక్తికరంగా మారింది.
Anil Sunkara | ఈ సినిమా చాలా స్పెషల్ గురూ.. అన్ని క్రాఫ్టుల్లోనూ కొత్తవారే
Mareesan OTT | ఓటీటీలోకి ఫహాద్ ఫాసిల్, వడివేలు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!