సచిన్రామ్ ప్రతాప్, హాసిని దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘శివగాడి జిందగీ’. వినయ్ రెడ్డి చందుపట్ల దర్శకుడు. ఐశ్వర్య సినీ క్రియేషన్స్ పతాకంపై సింధుసూర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఆవిష్కరించారు. మన సమాజంలోని సగటు మనిషి కథ ఇదని, జీవితం తాలూకు ప్రేమ, స్నేహం, కష్టాలను సహజంగా చూపించే ప్రయత్నం చేశామని..వినోదానికి కూడా పెద్దపీట వేశామని దర్శకుడు వినయ్ రెడ్డి తెలిపారు. ఓ సామాన్యుడి కథగా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుందని, త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సింధు సూర్య పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జేపీ రెడ్డి, సంగీతం: సాయి, రచన-సాహిత్యం-దర్శకత్వం: వినయ్ రెడ్డి చందుపట్ల.