Dil Raju | టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) మేనల్లుడు అశిష్ రెడ్డి (Ashish reddy)-అద్విత రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాడని తెలిసిందే. వీరి నిశ్చితార్థం 2023 నవంబర్‌లో జరుగగా.. జైపూర్‌లో జరుగనున్న ఈవెంట్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఫిబ్రవరి 14న జైపూర్‌లో ఘనంగా వివాహ వేడుక నిర్వహించేందుకు రెడీ అవుతుంది దిల్ రాజు కుటుంబం.
ఈ నేపథ్యంలో దిల్ రాజు, శిరీష్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందజేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అశిష్ రెడ్డి వెడ్డింగ్ ఈవెంట్‌కు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు, జూనియర్ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబులకు శుభలేఖ అందించారు. ఇదిలావుంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా దిల్ రాజు ఫ్యామిలీ శుభలేఖ అందించారు. ఫిబ్రవరి 14న జరుగనున్న ఈ వెడ్డింగ్ ఈవెంట్‌కు రావాల్సిందిగా రామ్ చరణ్‌ను శిరీష్, అశిష్ కోరారు. కాగా చరణ్‌కు శిరీష్, అశిష్ ఆహ్వానం అందిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.