Shine Tom Chacko | ఇటీవల కాలంలో మలయాళ యాక్టర్లు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. అలా సూపర్ క్రేజ్ అందుకుంటున్న యాక్టర్లలో ఒకడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko). నాని (Nani) నటించిన పక్కా మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. నాగశౌర్య నటించిన రంగబలిలో తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక షైన్ టామ్ చాకో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తేరి మేరీ (Teri Meri). హనీ రోజ్(Honey Rose), శ్రీనాథ్ బసి (Shreenath Basi) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా నిర్వహించగా.. ఈ ఈవెంట్లో షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తన డ్యాన్స్‌తో అలరించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్లోని కావాలా సాంగ్‌కు టామ్ చాకో స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Shine Tom Chacko dances for Kaavaala..
— Christopher Kanagaraj (@Chrissuccess) September 23, 2023
ఇదిలా ఉండగా.. కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ దేవర (Devara)లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు షైన్ టామ్ చాకో. ఎన్టీఆర్ 30 (NTR 30)గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దేవర 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.