Shilpa shirodkar | టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు ఆయన మరదలు, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
”పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. మీ మంచితనంతో మాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటారు. ప్రతి సంవత్సరం మీకు ఇలాగే మంచి జరగాలని కోరుకుంటున్నాను. లవ్ యూ అంటూ శిల్పా రాసుకోచ్చింది. దీనితో పాటు ఒక ఫొటోను జత చేసింది. ఇక శిల్పా పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.