Jatadhara | యువ కథానాయకుడు సుధీర్ బాబు (Sudheer Babu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’ (Jatadhara). ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ (Venkat Kalyan & Abhishek Jaiswal) సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. వెంకట్ కళ్యాణ్ కథనందిస్తున్నాడు. తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ ఇటీవల టీజర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి మరో పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ శోభ అనే కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శోభ ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. శిల్పా చాలా రోజుల తర్వాత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
She isn’t just driven by greed, she defines it. Presenting #Shobha.#UmeshKrBansal #PrernaArora @zeestudios_ @zeestudiossouth @isudheerbabu @sonakshisinha @shivin7 #ArunaAgarwal #ShilpaSinghal @DeshmukhPragati @girishjohar @kejriwalakshay @IamDivyaVijay @bhavinigoswami_ @ikussum… pic.twitter.com/Cd4YuFNir4
— Shilpa shirodkar (@Shilpashirodkr) August 28, 2025