Jacqueline Fernandez | శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులకి కూడా మాంచి కిక్ ఇచ్చింది. సాహో చిత్రంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి స్టెప్పులేసిందీ . ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఎక్కువగా నిలుస్తుంది. మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కారణంగా ఈ భామ పేరు హాట్ టాపిక్ అవుతుంది. అయితే జాక్వెలిన్ సినిమాలలో కథానాయికగా నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్, వీడియో ఆల్బమ్స్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఆమె నటించిన ‘బెసోస్..’ సాంగ్ లీజైంది. ఈ సాంగ్ లో జాక్వెలిన్ తో పాటు మరో సెలబ్రిటీ కూడా స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
అయితే సడెన్‌గా చూసి ప్రభుదేవాలా కనిపిస్తున్న ఈ కౌబాయ్ ఎవరా అని తీక్షణంగా చూస్తున్నారు. సాంగ్ లో జాక్వెలిన్ తో స్టెప్పలేసింది టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్. ఆసక్తికరంగా ఒక క్రికెటర్ ఇలా జాక్విలిన్ తో కలిసి సింగిల్ ఆల్బమ్‌లో నటించాలనే ఆలోచన క్రికెట్ ఫ్యాన్స్ లో ఉన్మాదం రేకెత్తించింది. ధావన్ ఫ్యాన్స్ ఈ వీడియోని జోరుగా ఆన్ లైన్ లో షేర్ చేస్తూ రరచ్చ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ పాట విడుదల కాగా, ఇందులో శిఖర్ రకరకాల వేషధారణలతో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ ఈ పాట నుంచి కొన్ని స్టిల్స్ వెబ్ ని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అందమైన జాక్విలిన్ సరసన శిఖర్ ధావన్ హీమ్యాన్ లా ఉన్నాడు. పైగా హ్యాట్ ధరించి కౌబోయ్ ని తలపిస్తున్నాడని కొందరు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
జాకీతో శిఖర్ కెమిస్ట్రీ కూడా ఒక రేంజులో వర్కవుటైంది. శ్రేయ ఘోషల్ – కార్ల్ వైన్ ఈ పాటను ఆలపించగా, ప్రస్తుతం ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక కొద్ది రోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న శిఖర్ ధావన్ .. ఓ విదేశీ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ జంటకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ కావడంతో అందరు అవాక్కయ్యారు. అలాంటి సమయంలో జాక్విలిన్ తో శిఖర్ సింగిల్ ఆల్బమ్ తో ముందుకు రావడం క్రేజీగా మారింది.