Shekar Master| టాలీవుడ్ బెస్ట్ కొరియోగ్రాఫర్స్లలో శేఖర్ మాస్టర్ తప్పక ఉంటారు. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారు. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా అతి సాధారణ స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫి చేస్తున్న శేఖర్ మాస్టర్ కొందరు హీరోలకి ఫేవరేట్ డ్యాన్స్ మాస్టర్. ఇప్పుడు ఆయన సినిమాలతో పాటు బుల్లితెరపైనా పలు షోలకు జడ్జిగా చేస్తూ రెండు చోట్లా తన మార్క్ చూపిస్తున్నారు. కెరీర్లో ఎన్నో అవమానాలు, చీత్కారాలు, తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు.
ఒకప్పుడు 75 రూపాయలు ఇస్తే తనకు రూ.కోటి దొరికినంత ఆనందం కలిగేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శేఖర్ మాస్టర్ . తనకు డ్యాన్స్ , సినిమా తప్పించి ఏం తెలియదని ఎన్నోసార్లు ఎడిపించారు శేఖర్ మాస్టర్. అయితే క్రియేటివిటీ పేరుతో ఐటెం సాంగ్స్, స్పెషల్ డ్యాన్స్ నెంబర్స్ , రొమాంటిక్ డ్యూయెట్స్ ను దిగజారుస్తున్నారను. మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటకే శేఖర్ మాస్టర్ , హరీష్ శంకర్ ను దారుణంగా ట్రోల్ చేశారు జనాలు. అయితే సినిమా వరకు ట్రోలింగ్ మొత్తం హరీష్ శంకర్ మీదకు మళ్లిపోయింది. ఇప్పుడు రాబిన్ హుడ్ పాట విషయంలో శేఖర్ మాస్టర్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
చిత్రంలో ‘అదిదా సర్ప్రైజు’ అనే పాట కేతిక వర్మపై తెరకెక్కించగా, అందులో స్టెప్పులు మంచి క్రేజీ ఉన్నాయి. కేతిక కూడా హుషారుగా చిందులేసింది. అయితే.. ఓ హుక్ స్టెప్ మాత్రం విమర్శలకు తావిచ్చింది. అమ్మాయిలతో ఇలాంటి స్టెప్పులు వేయిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది ఐటెమ్ పాటే అయ్యి ఉండొచ్చు . కాని హద్దులు మీరకూడదు అని అంటున్నారు. కేతిక వేసుకున్న కాస్ట్యూమ్ కి ఆ స్టెప్.. ఊర్లలో జాతర్లప్పుడు ట్రాక్టర్ల మీద వేసే స్టెప్పులను తలపించింది. స్కర్ట్ లేపే ఈ స్టెప్పులకి అందరు శేఖర్ మాస్టర్ని తిట్టిపోస్తున్నారు. సినిమాకి ఇది ఎఫెక్ట్ పడుతుందేమో అని నితిన్ని హెచ్చరిస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన “డాకు మహారాజ్” సినిమాలోని “దబిడి దిబిడి” సాంగ్ కి కూడా శేఖర్ మాస్టర్ని విమర్శించిన విషయం తెలిసిందే.