చార్మింగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న పానిండియా పిరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం కళాదర్శకుడు కిరణ్‌కుమార్ మన్నె ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ైక్లెమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందిస్తాయని, శర్వానంద్ తన రిస్కీ స్టంట్లతో సరికొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించనున్నారని మేకర్స్ చెబుతున్నారు.
20రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో సినిమాకు చెందిన కీలక భాగం పూర్తి కానున్నది. 1960ల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్‌లో జరిగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నదని, శర్వా కెరీర్లోనే చెప్పుకోదగ్గ సినిమాగా ఇది నిలుస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిశోర్‌కుమార్ ఆరోకియా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.