శర్వానంద్ కథానాయకుడిగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ‘శర్వానంద్ 36’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో శర్వానంద్ బైక్ రేసర్‌గా ఛాలెంజింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం శర్వానంద్ పర్సనల్ స్టిల్స్‌ని విడుదల చేశారు. ైస్టెలిష్ మేకోవర్‌లో ఉన్న శర్వానంద్‌ని ఈ స్టిల్స్‌లో చూడొచ్చు. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: విక్రమ్.