హీరో శర్వానంద్ కెరీర్లో తొలి పానిండియా సినిమా రూపొందనుంది. సంపత్‌నంది దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథగా ఈ సినిమా రూపొందనున్నదని మేకర్స్ తెలిపారు. మరపురాని అనుభూతిని కలిగించే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నదని వారు పేర్కొన్నారు. ఈ సినిమాకోసం హీరో శర్వానంద్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. బాలీవుడ్ ైస్టెలిస్టులు ఆలిమ్ హకీమ్, పట్టణం రషీద్‌ల నేతృత్వంలో వినూత్నమైన లుక్‌లోకి శర్వా మారారు. ఆయన రూపం 1960ల నాటి లుక్‌ని ప్రజెంట్ చేస్తున్నది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలో ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సివుంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్.ఎస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.