Sharwanand | టాలీవుడ్ బ్యాచ్‌లర్ హీరోల్లో ఒకడైన శర్వానంద్ (Sharwanand) ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసిందే. జనవరిలో హైదరాబాద్‌లో శర్వానంద్- (Rakshita Reddy) రక్షితారెడ్డి (సాఫ్ట్వేర్ ఇంజినీర్) నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఇద్దరు కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నారు. తాజాగా శర్వానంద్ రాయల్ వెడ్డింగ్ (royal wedding) వివరాలు బయటకు వచ్చాయి. తాజా అప్డేట్ ప్రకారం రాజస్థాన్ జైపూర్‌లోని లీలా ప్యాలెస్ వీరిద్దరి వెడ్డింగ్‌కు వేదిక కానుంది.
ప్యాలెస్‌లో రెండు రోజుల పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. జూన్ 2న మెహిందీ ఫంక్షన్ నిర్వహించనున్నారు. జూన్ 3న వివాహ వేడుక జరుగనుండగా.. టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు వేడుకలో సందడి చేయబోతున్నారట. ఇప్పటికే వెడ్డింగ్ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని ఇన్సైడ్ టాక్. రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కాగా ఆమె తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు లాయర్. శ్రీరామ్ ఆదిత్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ వెడ్డింగ్ పనులపై ఫోకస్ పెట్టాడట. వెడ్డింగ్ తర్వాత సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు టాక్.
శర్వానంద్ 35గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హేశమ్ అబ్దుల్ వహబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గతేడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్.
శర్వానంద్ ఎంగేజ్మెంట్ స్టిల్స్..

Sharwanand Engagement Photos

Sharwanand Engagement Photos

Sharwanand Engagement Photos

Sharwanand Engagement Photos

Sharwanand Engagement Photos