ప్రముఖ హీరో శర్వానంద్ నిర్మాతగా మారబోతున్నారు. త్వరలో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారాయన. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నది. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా న్యూ టాలెంట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే సంకల్పంతో శర్వా ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే.. ఆయన హోటల్ బిజినెస్‌లో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారట.
హైదరాబాద్ నగర శివార్లలో భారీగా వెల్నెస్ సెంటర్ కమ్ లీజర్ రిసార్ట్ కట్టేందుకు శర్వా సమాయత్తం అవుతున్నారని తెలిసింది. ఓవైపు నటుడిగా బిజీగా ఉంటూ, మరోవైపు నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటేందుకు శర్వా సిద్ధమవ్వడం ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.