Oke Oka Jeevitham Collections | చాలా కాలం తర్వాత శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ‘మహానుభావుడు’ తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్తో నిరాశలో ఉన్న శర్వాకు ఈ చిత్రం మంచి ఎనర్జీ ఇచ్చింది. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు నుండి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా రోజు రోజుకు ప్రేక్షకుల్లో సినిమాపై ఆధరణ పెరుగుతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అక్కినేని అమల కీలకపాత్ర పోషించింది. శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని ఈ ఏడాది టాలీవుడ్ 13వ సినిమాగా క్లీన్ హిట్ సాధించింది. ఇక ఏరియా వైజ్ ఈ చిత్ర కలెక్షన్లు చూసుకుంటే:
నైజాం : 2.65 కోట్లు
సీడెడ్ : 0.42 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.61 కోట్లు
ఈస్ట్ : 0.41 కోట్లు
వెస్ట్ : 0.28 కోట్లు
గుంటూరు : 0.40 కోట్లు
కృష్ణ : 0.36 కోట్లు
నెల్లూరు : 0.22 కోట్లు
ఏపీ+తెలంగాణ : 5.35 కోట్లు( 8.90 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.44 కోట్లు
తమిళ్ : 1 కోటీ
ఓవర్సీస్ : 1.50 కోట్లు.
టోటల్ వరల్డ్ వైడ్ : 8.29 కోట్లు(19.25 కోట్ల గ్రాస్)
‘ఒకే ఒక జీవితం’ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో ద్విభాషా చిత్రంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలో కలుపుకుని ఈ చిత్రానికి రూ.7.50 కోట్ల ప్రీ రిలీజ్బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.8 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. తొమ్మిది రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.8.29 కోట్ల షేర్‌ను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.
Read Also:
SSMB29 | మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్లుగా ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు?
Shaakuntalam Movie | సమంత ‘శాకుంతలం’ నుండి ‘దుష్యంతుడి’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్..!
Shankar | శంకర్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్?
Adipurush Movie | ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహన్ ఆయనకు భార్యగా నటించిందా?