‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్..ఫస్ట్ లుక్
శర్వానంద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్నే శ్రీకారం అంటూ వచ్చిన ఈయన.. త్వరలోనే మహా సముద్రం సినిమాతో రానున్నాడు. ఇప్పుడు తన 30వ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నారు.

శర్వానంద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్నే శ్రీకారం అంటూ వచ్చిన ఈయన.. త్వరలోనే మహా సముద్రం సినిమాతో రానున్నాడు. ఇప్పుడు తన 30వ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. శర్వానంద్ వెనకాల గిటార్ వేసుకుని ఉండడం పోస్టర్లో చూపించారు.
ఈ పోస్టర్లో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్ ని చూపించారు. ఈ పోస్టర్ ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఉంది. శర్వానంద్ సరసన మన తెలుగమ్మాయి రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తుండగా డియర్ కామ్రెడ్ ఫేమ్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగమయ్యారు.
ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సై – ఫై ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కి నచ్చే విధంగా ఉండబోతుంది. నిజానికి తల్లి-కొడుకుల బంధంతో ఉన్న సినిమాలు అన్ని వర్గాల వారికి నచ్చుతాయి. ఇప్పటికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఒకే ఒక జీవితంతో శర్వానంద్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Discover the Beauty of LIFE! 💌
— Vamsi Kaka (@vamsikaka) June 28, 2021
Presenting you the First Look of @ImSharwanand's #OkeOkaJeevitham💖#ఒకేఒకజీవితం💖 @riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i @twittshrees @JxBe @sujithsarang @sreejithsarang @prabhu_sr @DreamWarriorpic #Sharwa30 #OOJ #OOJFirstLook pic.twitter.com/0kcnvI7ovM
ఇవి కూడా చదవండి..
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

