శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంయుక్త, సాక్షివైద్య కథానాయికలు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
సకుటుంబ కథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని, శర్వానంద్ పాత్ర నవ్యరీతిలో సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్చంద్రశేఖర్, కథ: భాను భోగవరపు, నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.