కొన్నాళ్లుగా హిట్స్ లేక సతమతమవుతున్న శర్వానంద్ ఈ ఏడాది మార్చిలో ‘శ్రీకారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. త్వరలో శర్వా.. ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ బాబు. ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి.
తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్, జనవరి నెలలో పెద్ద సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన తెలుగమ్మాయి రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఒకే ఒక జీవితం’ సినిమా త్వరలో విడుదలకు సిద్దమైంది.