మంచి ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా కాలమైయింది. శర్వానంద్ (sharwanand ) ‘మనమే’ ట్రైలర్ చూసినపుడు అలాంటి మంచి ఫ్యామిలీ వైబ్ వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతిశెట్టి (KRITHI SHETTY ) హీరోయిన్. మనమే శర్వాకి 35వ లాండ్ మార్క్ మూవీ కావడం, దాదాపు ఈ సినిమా షూటింగ్ అంతా లండన్ లో జరగడం, ప్రమోషనల్ కంటెంట్ ప్రామెసింగ్ గా వుండటంతో సినిమాపై అందరి ద్రుష్టిపడింది. మరా ఆసక్తిని ‘మనమే’ కొనసాగించిందా? శర్వాకి మరో హిట్ పడిందా? ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే అంశాలు ఏమిటి ? రివ్యూ ( Manamey Telugu Movie Review )లో చూద్దాం.
కథ: విక్రమ్ (శర్వానంద్) ఓ ప్లేబోయ్ లాంటి కుర్రాడు. తనకి ఎలాంటి బరువు, బాధ్యతలు లేవు. లండన్ లో హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. సుభద్ర (కృతిశెట్టి) విక్రమ్ క్యారెక్టర్ కి పూర్తిగా భిన్నమైన అమ్మాయి. చాలా బాధ్యతగా వుంటుంది. ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడుతుంది. ఇలాంటి భిన్న ధృవాలైన విక్రమ్, సుభద్ర అనుకోని పరిస్థిలుల్లో ఖుషి (విక్రమ్ ఆదిత్య) అనే ఓ చిన్ని పిల్లాడికి కేర్ టేకర్స్ గా ఉండాల్సివస్తుంది. తర్వాత ఏం జరిగింది? పిల్లాడిని చూసుకోవడంలో ఎలాంటి తిప్పలు పడ్డారు? అసలు పిల్లాడికి కేర్ టేకర్స్ ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? ఖుషి ఎవరు? విక్రమ్, సుభద్ర, ఖుషిలా ప్రయాణం చివరికి ఏ తీరాలకు చేరింది ? ఇవన్నీ తెరపై చూడాలి.
విశ్లేషణ: తెలుగులో పిల్లల పెంపకం నేపధ్యంలో వచ్చిన సినిమాలు అరుదే. ఇలాంటి అరుదైన పాయింట్ తో రూపొందిన సినిమా మనమే. జీవితంలో పరిచయం లేని ఓ యువ జంట, తాము వూహించిన ఓ భాద్యతని తీసుకుంటారు. చాలా బ్యూటీఫుల్ లైన్ ఇది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అంతే అందంగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. హీరో క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేస్తూ కథ మొదలౌతుంది. చాలా తక్కువ రన్ టైం లోనే ఈ సినిమాలో అసలు కాన్ ఫ్లిక్ట్ తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు మంచి ప్రతిభ కనబరిచాడు. బాబు విక్రమ్ ఆదిత్య విక్రమ్ సుభద్ర జీవితంలోకి రావడంలో అసలు ఫన్ అండ్ ఎమోషన్ రైడ్ మొదలౌతుంది.
పిల్లాడిని చూసుకోవడంలో విక్రమ్ సుభద్ర పడే పాట్లు సరదగా నవ్విస్తాయి. తొలిసగం అంతా ఫన్ ఫుల్ గా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. విరామం తర్వాత వచ్చే విక్రమ్, సుభద్ర మధ్య సాగే ప్రేమ సంఘర్షణ ఇంకాస్త బలంగా వుండాల్సింది. అలాగే బెలూన్ ఫెస్టివల్ ఎపిసోడ్ కూడా అంత వినోదాన్ని ఇవ్వలేకపోయింది. అయితే క్లైమాక్స్ లో పేరెంట్స్ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా వుంటాయి. చివర్లో హ్యాపీ ఎండింగ్ తో ముగించడం బావుంది.
నటీనటులు: ఛార్మింగ్ స్టార్ టైటిల్ కి న్యాయం చేస్తూ భలే హుషారుగా కనిపించాడు శర్వా. తన పాత్ర చుట్టూనే వినోదం వుంటుంది. తన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ చెప్పే విధానం చాలా ప్లజెంట్ గా కుదిరాయి. ఎమోషన్స్ సీన్స్ లో కూడా మెప్పించారు. కృతిశెట్టి అందంగా కనిపించింది. నటనకు ఆస్కారం వుండే పాత్ర దక్కింది. పిల్లాడు విక్రమ్ చాలా క్యూట్ గా వున్నాడు. చాలా చోట్ల తన ప్రజెన్స్ సీన్ ని నిలబెడుతుంది. శివకందుకూరి గెస్ట్ రోల్ లాంటి పాత్రలో హుందాగా చేశారు. రాహుల్ రామకృష్ణ పాత్రని ఇంకా బలంగా వాడుకోవాల్సింది. వెన్నెల కిషోర్ నవ్విస్తారు. సీరత్ కపూర్, ఆయేషా ఖాన్ కూడా అతిధి పాత్రల్లోనే మెరిశారు. మిగతా నటీనటులు పరిధిమేర కనిపించారు.
టెక్నికల్ : హేశమ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. 16 పాటలు వున్నాయి. కానీ చాలా వరకూ బిట్ సాంగ్స్. అవన్నీ కథలో బాగా ఇమిడాయి. విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి. లండన్ లో తీసిన పోర్షన్ అంతా బ్యూటీఫుల్ గా వచ్చింది. కన్నుల పండగలా లాంటి అనుభూతిని ఇస్తాయి. నిర్మాణ విలువలు గ్రాండ్ గా వున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఫ్యామిలీ అందరితో కలిసి చూడగలిగే చక్కని హోల్సమ్ ఎంటర్ టైనర్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్
శర్వానంద్, కృతిశెట్టి, విక్రం ఆదిత్య నటన
కథలోని కొత్త పాయింట్
ఎమోషన్స్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో తగ్గిన వినోదం
ప్రేమకథ బలంగా లేకపోవడం
రేటింగ్ : 2.75/5
Read More
Krithi Shetty | ఓర చూపులతో మెస్మరైజ్ చేస్తున్న కృతి శెట్టి..