ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంలో చక్కటి అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాజీ మిస్ ఇండియా మానస వారణాసి. ఈ సినిమా విజయంతో ఈ భామకు తెలుగులో భారీ ఆఫర్లొస్తున్నట్లు వినికిడి. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్‌తో కలిసి ఆమె ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. శర్వానంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘జార్జ్ క్రిష్’ పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో కథానాయికగా మానస వారణాసిని కంఫర్మ్ చేసినట్లు తెలిసింది.
ఈ సినిమాలోని కథానాయిక పాత్ర కోసం అనంతిక సనీల్‌కుమార్, రుక్మిణి వసంత్, మమితాబైజు పేర్లు మొన్నటివరకూ వినిపించాయి. చిత్రబృందం చివరకు మానస వారణాసి వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది.