Sharwa 37 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి Sharwa 37. ఈ చిత్రానికి సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి.
అద్భుతమైన ఫన్ రైడ్‌గా ఉండబోతుందని తెలియజేస్తూ.. ఇప్పటికే ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఓ లుక్ షేర్ చేయగా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యూటీఫుల్ ట్యూన్‌తో హీరోహీరోయిన్ల ట్రాక్ ఒకటి విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన మేకర్స్.. డేట్‌ను మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు.
ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శర్వా 37కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36లో కూడా నటిస్తున్నాడు.
ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. గూస్బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఒకటి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
Team #Sharwa37 wishes everyone a very #HappyKrishnaJanmashtami. 𝐓𝐢𝐭𝐥𝐞 and 𝐅𝐢𝐫𝐬𝐭 𝐋𝐨𝐨𝐤 out soon. pic.twitter.com/dCAo6V87Z2
— BA Raju’s Team (@baraju_SuperHit) August 26, 2024
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?
Saripodhaa Sanivaaram | సరిపోదా శనివారం ప్రీ సేల్స్.. నాని తన రికార్డు తానే బ్రేక్ చేస్తాడా..?