బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్‌ఖాన్ (Sharukh Khan) తన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడంతో చాలా రోజులుగా తన షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఈ కేసు వ్యవహారం బయటకు రావడంతో పఠాన్ (Pathan) షూటింగ్ అర్థాంతరంగా నిలిపేసి బయటకు వచ్చాడు షారుక్‌ఖాన్. దీంతో చాలా మంది అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇప్పటివరకు పఠాన్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ తెరపైకి వచ్చింది. పఠాన్ షూటింగ్ జనవరి నుంచి రీస్టార్ట్ కానున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. షారుక్ ఖాన్ కూడా తన బాడీ లాంగ్వేజ్‌పై ఫోకస్ పెట్టాడట. నెక్ట్స్ మొదలు కానున్న షెడ్యూల్లో పఠాన్‌కు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సీన్ల కోసం తన మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడని ఇన్సైడ్ టాక్. సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్న పఠాన్‌లో దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
చివరిసారిగా 2018లో ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో వచ్చిన జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు షారుక్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది.
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’