Sharukh Khan | బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తన తాజా చిత్రం కింగ్ మూవీ సెట్లో ప్రమాదానికి గురైనట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముంబైలోని గోల్డెన్ టొబాకోలో కింగ్ మూవీ షూటింగ్ జరుగుతుండగా, కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల కోసం పెద్ద సెట్ నిర్మించారట. అయితే అందులో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో షారూఖ్ గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. గాయం గురించి పూర్తి క్లారిటీ అయితే రావలసి ఉంది. ఇక షారూఖ్ తన టీమ్‌తో కలిసి అత్యవసర వైద్య సహాయం కోసం అమెరికాకి వెళ్లారని బాలీవుడ్ మీడియా చెబుతుంది.
అయితే షారూఖ్ కండరాలకి తీవ్ర గాయం అయినట్టు సమాచారం. పెద్దగా కంగారు పడాల్సింది ఏమి లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డ షారూఖ్ ఖాన్ అప్పుడు చికిత్స తీసుకున్నారు. అయితే ఈ వార్తలకి సంబంధించి షారూఖ్ ఖాన్ పర్సనల్ మేనేజర్ పూజా దద్లాని కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సినిమాల కోసమే కాకుండా పర్సనల్ గా కూడా ఫిట్ గా ఉంటాడు షారుఖ్ ఖాన్. 59 ఏళ్ల వయసులోనూ షారుఖ్ ఖాన్ ఎంతో ఫిట్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. కేవలం ఫిట్ గా ఉండడమే కాదు. ట్రెండీగా కూడా ఉంటున్నాడు. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇప్పటికీ షారుఖ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటున్నాయి.
పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తన కూతురు సుహానా ఖాన్ తో కలిసి కింగ్ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ కథా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో సుహానా ఖాన్ తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే షారూఖ్ త్వరగా కోలుకొని ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.