Shanthi Priya | తన అందం, అభినయంతో అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ భానుప్రియ.ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఇటీవల భానుప్రియ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తుంది. అయితే భానుప్రియ చెల్లి శాంతి ప్రియ కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగులో మహర్షి, కలియుగ అభిమన్యుడు, సింహ స్వప్నం.. లాంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శాంతిప్రియ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ హిందీ హీరో సిద్ధార్థ్‌రాయ్‌ను 1999లో పెళ్లి చేసుకుంది. అనంతరం సినిమాలకు దూరమైంది.
నాటి నటి, ప్రముఖ నటి భానుప్రియ సోదరి శాంతిప్రియ తాజా లుక్ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. చనిపోయిన తన భర్త సిద్ధార్థ్ రాయ్ బ్లేజర్ ధరించి గుండుతో దర్శనమిచ్చింది. 2004లో శాంతి ప్రియ భర్త గుండెపోటుతో మరణించారు. తన భర్త చనిపోయే ముందే శాంతిప్రియ టీవీలోకి రీ ఎంట్రీ ఇచ్చి పలు టీవీ సీరియల్స్, టీవీ షోలు చేసింది. అయితే భర్త చనిపోవడంతో తీవ్ర బాధ అనుభవించిన శాంతిప్రియ గుండు గీయించుకొని ఒక బ్లేజర్ వేసుకొని హాట్ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి సంచలనంగా మారాయి.అందానికి తగిన నిర్వచనం ఇచ్చేందుకు తాను ఇలా ఫోటోలు దిగినట్లు శాంతిప్రియ స్పష్టం చేసింది.
మనోధైర్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల తాను గుండు చేయించుకున్నట్టు తెలిపింది. విభిన్నమైన అనుభూతిని పొందుతున్నట్లు శాంతిప్రియ పేర్కొంది. మహిళగా మనం జీవితంలో కొన్ని పరిమితులు పెట్టుకుంటామని.. ఈ విధమైన మార్పుతో అన్నింటి నుంచి తాను విముక్తి పొందుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచం మనపై విధించిన అందం ప్రమాణాలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో తాను ఇలా చేసినట్టు శాంతిప్రియ స్పష్టం చేసింది. నా భర్తకు బ్లేజర్ ధరించి తాను ఇంకా నా వద్దే ఉన్నారనే అనుభూతిని పొందినట్లు చెప్పుకొచ్చింది. ఇక దీనిపై కొందరు నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.