Puri Jagannadh | టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం హిట్లు లేక సతమవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు పోకిరి, దేశముదురు, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి వంటి బ్లాక్ బస్టర్లతో పాటు ఇండస్ట్రీ హిట్లను అందించిన పూరి ప్రస్తుతం సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో పూరి పని అయిపోయిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏదోక ఒకరోజు సాలిడ్ కమ్‌బ్యాక్‌తో మళ్లీ ఫాంలోకి వస్తాడని అతడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే పూరి తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ‘పూరి కనెక్ట్స్’ ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి విజయ్ సేతుపతి అభిమానులతో పాటు తమిళ మీడియాకు చెందిన వ్యక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. కెరీర్ టాప్‌లో ఉన్న నువ్వు ఒక ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడం అవసరమా అని సేతుపతిని నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. మరోవైపు పూరి జగన్నాథ్ టైం అయిపోయిందని అతడు అవుట్‌డేటేడ్ అయ్యాడని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ ట్రోలింగ్‌పై తమిళ స్టార్ డైరెక్టర్ భాగ్యరాజ్ కుమారుడు, నటుడు శాంతను భాగ్యరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో పూరీకి మద్దతుగా నిలిచాడు.
”ఎదుటి వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడొద్దు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో అసభ్యమైన పదజాలాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకండి. ఆయన ఒక ప్రఖ్యాత దర్శకుడు, నిర్మాత. సినిమా ఇండస్ట్రీలో ఇతరులను గౌరవించడం నేర్చుకోండి. మీ నుంచి ఇలాంటిది ఊహించలేదంటూ” శాంతను రాసుకోచ్చాడు.
Never say that about someone brother…
Please use words wisely on public platform… eod he is a reputed filmmaker and there’s a certain amount of respect we shud give another person ..
Did not expect this from you https://t.co/Ieapsl1N49— Shanthnu (@imKBRshanthnu) March 30, 2025