Shanmukha Aha| టాలీవుడ్ యువ నటుడు ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. ఈ సినిమాకు షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించగా.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్ అవికాగోర్ కథనాయికగా నటించింది. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. మార్చి 21న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది.
కథ విషయానికి వస్తే.. ఒక మారుముల గ్రామంలో నిత్యం పూజలు చేసే ఉపాసకుడు విగాండ (చిరాగ్ జానీ) దంపతులకు ఆరు ముఖాలతో, కురూపంగా ఉన్న ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుడి వికృత ముఖాన్ని చూసిన ఊరిలోని ప్రజలందరూ అతడిని చూసి భయపడిపోతుంటారు. అయితే విగాండ్ తన కుమారుడికి “షణ్ముఖ” అని పేరు పెట్టి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు.
మరోవైపు కార్తీ (ఆది సాయికుమార్) పోలీస్ ఆఫీసర్. డ్రగ్స్ మాఫియాను పట్టుకొనేందుకు వెళ్లిన సమయంలో జరిగిన దాడిలో తన పిస్టల్ కోల్పోతాడు. దీంతో తన తప్పును సరిదిద్దుకోవడానికి కమిషనర్ అతడికి వారం రోజుల గడువు ఇస్తాడు. మరోవైపు, బెంగళూరులో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సారా మహేశ్ (అవికా గోర్) తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. తన మాజీ ప్రియుడు కార్తీని కలిసి అదృశ్యం అవుతున్న అమ్మాయిల ఆచూకీ కోసం తను రీసెర్చ్ చేస్తున్నట్లు ఈ విషయంలో సాయం కావాలని అడుగుతుంది. దీనికి ఒప్పుకున్న కార్తీ తప్పిపోయిన అమ్మాయిల జాడ గురించి వెతకడం మొదలుపెడతాడు.
అయితే క్షుద్ర పూజలు నేర్చుకుని వచ్చిన విగాండ తన కుమారుడు అందంగా మారడం కోసం ఎటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడ్డాడు? అమ్మాయిల అదృశ్యాల వెనుక విగాండ్కు ఏదైనా సంబంధం ఉందా? కార్తీ, సారా మధ్య గతంలో ఎందుకు విడిపోయారు? కార్తీ తన కోల్పోయిన తుపాకీని తిరిగి పొందగలిగాడా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
A cop, a scholar, and an ancient mystery!
Dive into the forgotten tales, hidden treasures, and secrets buried deep in the forest.#Shanmukha Premieres from April 11 only on #aha #AadiSaikumar #Avikagor #Shanmukha pic.twitter.com/YvnuUBU6P3
— ahavideoin (@ahavideoIN) April 10, 2025