బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో మొదటి నుండి సిరి, షణ్ముఖ్ జంటగా ఆడుతూ వస్తున్న విషయం తెలిసిందే. సిరి తనతో కాకుండా హౌస్‌లో ఉన్న ఎవరితో క్లోజ్ అయినా మన ఇగో మాస్టర్ షణ్ముఖ్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. తాజా ఎపిసోడ్లో సిరి.. మానస్, కాజల్, సన్నీలతో క్లోజ్‌గా ఉండటం వల్ల, ఆ సందర్భంలో మానస్-సిరిల మధ్య ఏదో కొత్త ట్రాక్ వేయడానికి సన్నీ, కాజల్‌లు ప్రయత్నిస్తున్నారంటూ తెగ ఫీల్ అయిపోయాడు షణ్ముఖ్.
పడుకున్న షణ్ముఖ్ సీరియస్‌గా లేచి మోజో రూంలో కూర్చొని చాలా గుర్రుగా కనిపించాడు. షణ్ముక్‌ని గమనించిన సిరి అతడి దగ్గరకు రావడంతో .. ముఖం సీరియస్‌గా పెట్టి ‘నేను లేచి ఉంటే ఒకలా బిహేవ్ చేస్తావ్.. పడుకుంటే మరోలా బిహేవ్ చేస్తావ్.. వాళ్లంతా యాక్సెప్టింగ్ గురించే మాట్లాడుతున్నారు.. ఆ మూమెంట్లో నేను ఎలా లేచివచ్చానో చూశావ్ కదా.. నేను అవి ఎందుకు వినాల్సి వచ్చింది??
ఇంకో రెండు వారాలు ఆ తరువాత ఇవేం నాకు వద్దు.. ఎవడు గేమ్ ఆడుతున్నాడో నీకు తెలియదు.. ఎవరు కొత్తగా ట్రాక్‌లు మొదలుపెట్టాలనుకుంటున్నారో నీకు తెలియదు.. ’అని తెగ ఫీల్ అయిపోయాడు షణ్ముఖ్. దీంతో సిరి నెగెటివ్‌గా అనుకోకు షణ్మూ.. ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలుసు అని చెప్పింది. అవేమి వివనని షణ్ముఖ్.. నువ్వు టాప్ 6 కాని, నా దగ్గర నుండి వెళ్లిపో అని అంటాడు. సీరియస్‌గా వెళ్లిన సిరి మళ్లీ అతని దగ్గరకు వచ్చి సారీ చెబుతుంది.