బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకోగా, సెప్టెంబర్ నుండి ఐదో సీజన్ జరుపుకోనుంది. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌కి సంబంధించి జోరుగా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఓ లిస్ట్ అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఆ లిస్ట్‌లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, జబర్దస్త్ ప్రియాంక, ఆనీ మాస్టర్, కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్ జస్వంత్, పూనం భాజ్వా, యాంకర్ శివ, లోబో, యాంకర్ ప్రత్యూష ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే షణ్ముఖ్ జశ్వంత్ ఈషోకి తీసుకునే రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ వెబ్‌సిరీస్‌తో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఆయన ఏ వీడియో చూసి లెక్కలేనన్ని వ్యూస్, లైకులు వస్తుంటాయి. గత మూడు సీజన్స్ నుండి ఆయనను బిగ్ బాస్ షో కోసం తీసుకోవాలని నిర్వాహకులు భావించగా, ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఈ సీజన్లో పాల్గొనేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుండగా, ఈ షో కోసం కోటి వరకు పారితోషికాన్ని ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.