ఆ క్లారిటీ ఇవ్వలేదే ?

స్టార్లతో సినిమాలు చేస్తున్నామని ప్రకటించడమే కాదు ఎప్పుడు ఎవరితో ముందు సినిమా స్టార్ట్ అవుతుందన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు దర్శకులు. అలా ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చకు కేరాఫ్ గా మారాడు తమిళ డైరక్టర్ శంకర్. కమల్ హాసన్ తో తీస్తోన్న భారతీయుడు 2 ఎంతవరకు వచ్చిందో తెలియదుకానీ ఈ దర్శకుడు మాత్రం వరస పెట్టి సినిమాలను ప్రకటిస్తున్నాడు.
కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ తో సినిమా ఉంటుందని ప్రకటించాడు. రామ్ చరణ్ తో కలిసి సినిమా తెరకెక్కించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే ఎప్పుడు ఈ సినిమా ప్రారంభమవుతుంది అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ తో సినిమా ఉంటుందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు సినిమాని హిందీలో తీస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏ హీరోతో ముందు సినిమా మొదలుపెడతాడన్నదే ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతానికి రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇది దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఇక రన్వీర్ సింగ్ 83, సర్కస్, జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి వీరిద్దరిలో ఎవరి డేట్స్ ఖాళీగా ఉన్నాయి..ఎవరితో ముందు మొదలెడతాడు అన్నది ఇంట్రస్టింగ్ పాయింట్. ఎందుకంటే శంకర్ సినిమా అంటేనే పూర్తివడానికి దాదాపు రెండేళ్లు అవుతుందన్న టాక్ ఉంది. మరి రామ్ చరణ్, రన్వీర్ లలో ఎవరు శంకర్ డైరక్షన్ లో సినిమాకి రెడీ అవుతారన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

