RC15 Movie | మెగా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. పైగా ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఓ రేంజ్లో అంచనాలున్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ఏప్రిల్ 23న మొదలు కానున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఎపిసోడ్ సినిమాకే హైలేట్‌గా ఉండబోతుందట. ఇండియన్ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శంకర్ క్లైమాక్స్‌ను ప్లాన్ చేశాడట. అంతేకాకుండా క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీన్ కోసం ఏకంగా 1200 ఫైటర్స్‌ను తీసుకోనున్నారట. కేజీఎఫ్ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన అన్బరివ్ నేతృత్వంలో ఈ ఫైట్ ఎపిసోడ్ తెరకెక్కనుందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇటీవలే భారతీయుడు-2 షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన శంకర్.. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు.
ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు కథ అందించాడు. చరణ్‌కు జోడీగా కియరా అద్వానీ, అంజలీలు నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సునీల్, ఎస్.జే సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ స్వరాలందిస్తున్నాడు.