Poorna | నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని ఎంతగానో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం కాగా, పూర్ణని స్క్రీన్ నేమ్ గా చేసుకుంది.. కేరళకు చెందిన షమ్నా కాసిం.. పూర్ణగా వెండితెరకు పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ‘మంజు పోలోరు పెన్‌కుట్టి’ అనే మలయాళ సినిమా ద్వారా 2004లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది పూర్ణ.. మూడేళ్ల పాటు మాలీవుడ్‌లోనే నటించి ఆ తర్వాత 2007లో శ్రీహరి హీరోగా వచ్చిన ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
అనంతరం తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. తెలుగులో ‘సీమ టపాకాయ్’, ‘అవును’ సినిమాలు పూర్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే, పూర్ణ హీరోయిన్గా మాత్రమే కాకుండా తెలుగులో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. ఈ మధ్య కాలంలో ‘దృశ్యం 2’, ‘అఖండ’, ‘తీస్ మార్ ఖాన్’, ‘దసరా’ సినిమాల్లో పూర్ణ కనిపించి మెప్పించారు. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరించి సందడి చేసింది. 2023లో పూర్ణ వివాహం చేసుకోగా, ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు.
పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం దుబాయ్ కి చెందిన బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పూర్ణ కొడుకు హమదన్ అసిఫ్ అలీ రెండో పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా దుబాయ్ లో నిర్వహించారు. పూర్ణ ఈ ఈవెంట్ కి సంబంధించి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్ణ కొడుకు అచ్చం తల్లి మాదిరిగానే ఉన్నాడని, బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోయాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు.