కాస్టింగ్ కౌచ్ హిందీ చిత్ర పరిశ్రమకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇప్పటికీ రోజూ ఎవరో ఒక నాయిక ఈ విషయంలో తమ అనుభవాలు వెల్లడిస్తుంటారు. పేరున్న దర్శకులు, నటులు కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో చిక్కుకుని బద్నాం అయ్యారు. ఈ విషయంపై స్పందించింది షమా సికిందర్. ఆమె మాట్లాడుతూ… ‘అవకాశం ఇవ్వాలంటే రాజీ పడాల్సిందే అనేది చాలా మంది విషయంలో జరిగింది..
ఇది సినిమా ఇండస్ట్రీలోనే కాదు మిగతా రంగాల్లోనూ ఉందన్నది నిజం. గతంలో నిర్మాతలు ఎక్కువగా వేధించేవారు. అయితే ఇప్పుడు పరిశ్రమ కాస్త బాగు పడుతున్నది. సినిమా మీద ఇష్టంతో వస్తున్న కొత్త నిర్మాతలు నాయికలకు గౌరవం ఇస్తున్నారు, మర్యాదగా చూసుకుంటున్నారు, ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. ఇలా ప్రొఫెషనలిజం పెరగడం వల్ల తప్పుడు ఆలోచనలకు ఆస్కారం ఉండదు. ఏమైనా మా మహిళల మనసుల్ని భౌతికంగా ఇబ్బంది పెట్టి గెల్చుకోలేరు. మంచి మనసుతోనే దగ్గరవాలి’ అని చెప్పింది.