Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇండస్ట్రీలో ఇతర నటీనటులతో ఎలాంటి అనుబంధాన్ని కొనసాగిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌తోపాటు ఇతర భాషల నటీనటులతో చక్కటి బాండింగ్ మెయింటైన్ చేస్తుంటాడు చిరు. తాజాగా కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ కుమార్ సతీమణి షాలిని (Shalini)ఎవరూ ఊహించని విధంగా చిరంజీవితో కలిసి దిగిన త్రోబ్యాక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
తన సోదరి షామిలీ, నటుడు రిచర్డ్ రిషి, చిరంజీవితో ఫస్ట్ స్టిల్‌పై అందరి అటెన్షన్ తనవైపునకు తిప్పుకుంటోంది. ఇంతకీ ఈ ఫొటో ప్రత్యేకత ఏంటనే కదా మీ డౌటు. ఈ స్టిల్‌లో ఉన్నవారంతా 1990లో సూపర్ హిట్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరిలో నటించిన వారు కావడం విశేషం. సుమారు 34 ఏండ్ల తర్వాత త్రోబ్యాక్ స్టిల్‌ను షేర్ చేసుకుని ఆనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు చిరు అండ్ టీం. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.