రీమేక్ సినిమాలు నచ్చవు
‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది షాలిని పాండే. అందం, అమాయకత్వం కలబోసిన ప్రీతి పాత్రలో ఆమె అభినయానికి యువతరం ముగ్ధులయ్యారు. టాలీవుడ్లో ఘనమైన ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఆశించిన అవకాశాలు, విజయాలు దక్కలేదు.
‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది షాలిని పాండే. అందం, అమాయకత్వం కలబోసిన ప్రీతి పాత్రలో ఆమె అభినయానికి యువతరం ముగ్ధులయ్యారు. టాలీవుడ్లో ఘనమైన ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఆశించిన అవకాశాలు, విజయాలు దక్కలేదు. ప్రస్తుతం ఈ భామ హిందీ చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’లో తాను నాయికగా నటించలేకపోవడానికి కారణాల్ని వివరించింది.
ఆమె మాట్లాడుతూ ‘తెలుగులో నేను పోషించిన ప్రీతి పాత్ర అందరికి గుర్తుండిపోయింది. రీమేక్ గురించి నన్నెవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఆఫర్ వచ్చినా తిరస్కరించేదాన్ని కావొచ్చు. ఎందుకంటే స్వతహాగా నాకు రీమేక్స్‌లో నటించడం ఇష్టం ఉండదు. ఒకే పాత్రను భిన్న భాషల్లో చేయడం వల్ల పాత్రపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించే అవకాశం దొరకదు. అయితే ‘కబీర్‌సింగ్’లో షాహిద్‌కపూర్, కియారా అద్వాణీల మధ్య కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. గత ఏడాది ‘జయేష్‌బాయ్ జోర్దార్’ చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

