Dunki | షారుఖ్‌ఖాన్ (ShahRukhKhan)కు బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పఠాన్‌తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో చూపించాడు బాద్ షా. ఈ సారి మరోసారి జవాన్ సినిమాతో రూ.1000 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. కాగా మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
షారుఖ్ ఖాన్ నటిస్తోన్న డంకీ చిత్రాన్ని కూడా ఇదే రోజున విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే సలార్ (Salaar) రిలీజ్ నేపథ్యంలో డంకీ (Dunki) విడుదల వాయిదా వేయాలని షారుఖ్‌ఖాన్ టీం ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం 2024లో డంకీని విడుదల చేయాలనుకుంటున్నారట. దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్న షారుఖ్ ఖాన్.. ప్రభాస్ క్రేజ్ చూసే ఇలా వెనుకడుగు వేస్తున్నాడా..? అంటూ ఈ వార్త చదివిన మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు.
రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డంకీ’ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్ రెండు పార్టులుగా రాబోతుండగా.. పార్టు 1 డిసెంబర్ 22న సందడి చేయనుంది.
సలార్ టీజర్..