King Movie Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి గతేడాది ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదన్న విషయం తెలిసిందే. 2023లో పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో హిట్లు అందుకున్న కింగ్ ఖాన్ ఆ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు కనిపించలేదు. అయితే తాజాగా షారుఖ్ కింగ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మొదట ఈ ప్రాజెక్ట్‌కు అందరూ సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు అనుకున్నారు కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ సిద్ధార్థ్ ఆనంద్ చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. సిద్ధార్థ్ ఆనంద్ ఇంతకుముందు షారుఖ్‌తో పఠాన్ అనే సినిమా తెరకెక్కించాడు. అయితే కింగ్ సినిమా నుంచి గత కొన్ని రోజులుగా ఏ అప్డేట్ లేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి పలు విషయాలను పంచుకున్నాడు షారుఖ్.
ఆదివారం దుబాయ్‌లోని ఒక వేడుకకు ముఖ్య అతిథిగా హజరైన షారుఖ్ మాట్లాడుతూ.. తన ఆప్కమింగ్ ఫిల్మ్ కింగ్ సినిమాపై స్పందించాడు. కింగ్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చాలా చాలా స్ట్రిక్ట్. పఠాన్ అనే సినిమా కూడా తానే తెరకెక్కించాడు. అయితే తన సినిమాలకు సంబంధించి అన్ని విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతాడు. నాతో కూడా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి విషయాలను బయటపెట్టవద్దని తెలిపాడు. అందుకే సినిమా గురించి ఏం బయటకి చెప్పట్లేదు. కానీ మీకు మాట మాత్రం ఇస్తున్న ఈ చిత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది అంటూ షారుఖ్ చెప్పుకోచ్చాడు. షారుఖ్‌తో పాటు, ఈ చిత్రంలో షారుక్ కూతురు సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.