Jersey Movie | ఓటీటీ విడుదలకు సిద్ధమైన షాహిద్ కపూర్ ‘జెర్సీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Shahid Kapoor Jersey Movie On Ott | నాచ్యురల్ స్టార్ నాని కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాలలో ‘జెర్సీ’ ఒకటి. కమర్షియల్‌గా ఈ చిత్రం భారీ విజయం సాధించకపోయినా ప్రేక్షకుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్‌కపూర్ రీమేక్ చేశాడు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరీ రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. గతేడాది ప్రథమార్థంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ అదే రోజున ‘కేజీఎఫ్-2’ విడుదలవుతుండటం.. కేజీఎఫ్ చిత్రానికి హిందీలో విపరీతమైన బజ్ ఉండటంతో ‘జెర్సీ’ చిత్రాన్ని వారం రోజులు వాయిదా వేస్తూ ఏప్రిల్ 22న విడుదల చేశారు.
ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుంచే పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ అప్పటికే కేజీఎఫ్ బాలీవుడ్లో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుంది. దాంతో జెర్సీ చిత్రాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అంతేకాకుండా ఈ చిత్రం ఎమోషనల్‌గా కొంచెం స్లో పేజ్‌లో ఉండటంతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం రుచిపడలేదు. దాంతో ఈ చిత్రం మొదటి వారంలోపే దాదాపు సగానికి పైగా థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు ఈ చిత్రం కేవలం రూ.19.63 కోట్లను మాత్రమే సాధించి బడ్జెట్లో ఒక వంతు కలెక్షన్లను కూడా సాధించలేకపోయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో మే20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అదే రోజున ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కానుంది. జెర్సీ హిందీ చిత్రాన్ని అల్లు ఎంటర్టైనమెంట్స్, దిల్‌రాజు ప్రొడక్షన్, సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లతో కలిసి అమన్ గిల్ నిర్మించాడు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కు జోడీగా మృనాల్ తాకూర్ హీరోయిన్గా నటించింది. తెలుగులో సత్యరాజ్ పాత్రను పంకజ్ త్రిపాఠి పోషించాడు.
If you see us tearing up, it's because we just watched Jersey and we can’t wait for you to catch it too 🥺❤️
JERSEY ARRIVES ON NETFLIX ON 20TH MAY 🏏💯 pic.twitter.com/wFWqfQCboR
— Netflix India (@NetflixIndia) May 17, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

