Deva Movie | బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవా(Deva Movie). బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దేవా సినిమాను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రం రూపొందుతుండగా.. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
పూజ హెగ్దే, పావేల్ గులాటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే.. షాహిద్ రూత్‌లెస్ పోలీస్‌గా అలరించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ టీజర్‌ను మీరు చూసేయండి.