కింగ్‌ఖాన్ అభిమానులకు రచయిత అబ్బాస్ రైటేవాలా శుభవార్త చెప్పారు. పరాజయాలతో విసిగిపోయిన షారుఖ్‌ఖాన్‌కి గ్రేట్ కంబ్యాక్ అందించిన సినిమా ‘పఠాన్’. అయిదేళ్ల విరామం తర్వాత షారుఖ్‌కి దక్కిన అపూర్వ విజయం అది. షారుఖ్ కెరీర్లో వెయ్యికోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమాగా ‘పఠాన్’ని చెప్పుకోవాలి. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని యష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రకటించిన నాటినుంచి దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే.. ఎట్టకేలకు ఈ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ‘పఠాన్’ రచయిత అబ్బాస్ టైరేవాలా ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘పఠాన్ 2’ స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయింది. డైలాగ్ వెర్షన్ మాత్రమే మిగిలివుంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమా గత చిత్రాలను మించేలా ఉంటుంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు.’ అని తెలిపారు.