IIFA 2024 | ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక యూఏఈ రాజధాని అబుదాబిలో అంగరంగా వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి అవార్డులను ప్రకటించగా.. ఆదివారం బాలీవుడ్‌కు సంబంధించిన అవార్డులను ప్రకటించారు నిర్వహాకులు. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘జవాన్’ సినిమాలో నటనకు గాను ఈ అవార్డును అందుకోగా.. ఏఆర్ రెహమన్, మణిరత్నం చేతుల మీదుగా అవార్డును అందజేశారు. మరోవైపు టాలీవుడ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రంకు ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఇక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న 12th ఫెయిల్ (12th Fail) సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ చోప్రా అవార్డు అందుకున్నాడు. మిసెస్ ఛటర్జీ vs నార్వే సినిమాకు గాను ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ అవార్డు అందుకుంది.
Shah Rukh Khan wins IIFA 2024 ‘Best Actor’ award for his performance in ‘Jawan’
Read @ANI Story | https://t.co/U7T9gUmKda#ShahRukhKhan #Jawan #IIFA2024 pic.twitter.com/HlVXcMqten
— ANI Digital (@ani_digital) September 28, 2024