King Glimpse | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు (నవంబర్ 2) సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కింగ్’ (King)కు సంబంధించిన అప్డేట్ విడుదలైంది. అభిమానులకు బర్త్‌డే ట్రీట్‌గా.. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్రబృందం. పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Sidhharth Anand) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainment) నిర్మిస్తుంది. ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.