Shah Rukh Khan | ప్రముఖ హాలీవుడ్ సింగర్ ‘ఎడ్ షీరన్’ (Ed Sheeran) భారత్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఈ సింగర్ నగరమంతా చక్కర్లు కొడుతున్నాడు. మంగళవారం ఒక పాఠశాలను సందర్శించిన ఎడ్ అక్కడ పిల్లలతో కాసేపు సమయం గడిపాడు. అనంతరం బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఏర్పాటు చేసిన పార్టీలో సందడి చేసి అర్మాన్ మాలిక్ తో కలిసి బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేశాడు. అయితే బుధవారం రాత్రి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ను కలుసుకున్నాడు ఎడ్.
బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్‌తో కలిసి నేరుగా షారుఖ్ ఇంటికి వెళ్లిన ఎడ్ అక్కడ షారుఖ్‌తో పాటు గౌరీ ఖాన్‌ను కలుసుకున్నాడు. అనంతరం ఓం శాంతి ఓం సినిమాలోని దీవాంగి దీవాంగి పాటకు షారుఖ్, ఎడ్ షీరన్ కలిసి సిగ్నేచర్ స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.