Dunki Movie | జవాన్ (Jawan) తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించనున్న సినిమా డంకీ (Dunki). ‘మున్నాభాయ్’ సిరీస్ (తెలుగులో శంకర్దదా ఎంబీబీఎస్, జిందాబాద్), త్రీ ఇడియట్స్ (3 Idiots), ‘పీకే'(PK), ‘సంజు (Sanju) లాంటి బ్లక్ బస్టర్ సినిమాలు తీసిన రాజ్ కుమార్ హిరాణీ (Raj Kumar Hirani) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ పన్ను (Tapsee Pannu) నటిస్తుంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి అయిన ఈ సినిమా ఇప్పటికే సగనికి పైగా షూటింగ్ కప్లీంట్ చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
దీపావళి కానుకగా షారుఖ్ డంకీ సినిమా టీజర్ (Dunki Movie Teaser) ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దీపావళికి విడుదల కానున్న సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై 3 (టైగర్ త్రీ)తో పాటు డంకీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే అటు షారుఖ్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సల్మాన్ ఫ్యాన్స్‌కు పండగ అనే చెప్పుకోవాలి. కాగా దీనిపై అధికారిక సమాచారం కొరకు మరింత సమయం వేచి చూడాల్సి ఉంది.
డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్(Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
EXCLUSIVE :- The GREATEST COLLABORATION of the actor and director to release their Film #Dunki teaser on Diwali 2023 ! ARE YOU READY for this #SRK – #RajKumarHirani Masterpiece ? pic.twitter.com/r9OoXTLbbx
— CineHub (@Its_CineHub) August 22, 2023