Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి బాలీవుడ్ బాద్షాగా ఎదిగాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. కాగా, షారుక్ నటించిన పఠాన్ చిత్రం ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందుతూ.. కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. రూ. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న షారుక్.. మంగళవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. ‘వాలెంటైన్స్ డేకి గౌరీ మామ్కు మీ మొదటి బహుమతి ఏమిటి..?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి షారుక్ స్పందిస్తూ.. ఇప్పటికి 34 ఏండ్లైంది. నాకు గుర్తున్నంత వరకు ఒక జత పింక్ కలర్ ప్లాస్టిక్ చెవిపోగులు ఇచ్చినట్టున్నా’ అంటూ సమాధానమిచ్చారు. ‘ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియమైన వారి (అభిమానుల) నుంచి మీకు ఏం బహుమతి కావాలి..?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘మీరు ఇదివరకే నాకు ఇచ్చారు. పఠాన్ మూవీపై అపారమైన ప్రేమని’ అంటూ షారుక్ సమాధానిమిచ్చారు.
If I remember correctly it’s been what 34 years now….a pair of pink plastic earrings I think… https://t.co/pRY2jxl41B
— Shah Rukh Khan (@iamsrk) February 14, 2023
షారుక్ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1991 అక్టోబర్ 25న వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, అబ్రామ్.ప్రస్తుతం షారుక్ బాలీవుడ్లో స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు.
You have already given it to me…so much love for #Pathaan https://t.co/dSRxMnLhF3
— Shah Rukh Khan (@iamsrk) February 14, 2023