Jawan Vs Salaar | సెప్టెంబర్ నెల మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి.. ఎందుకంటే పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులు ఇదే నెలలో థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఊహించారా..? వీటిలో ఒకటి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తోన్న జవాన్ (Jawan) కాగా.. రెండోది ప్రభాస్ నటిస్తోన్న సలార్. జవాన్ సెప్టెంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సలార్ (Salaar)సెప్టెంబర్ 28న సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమాల గ్లింప్స్, టీజర్లు ఇప్పటికే నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. విడుదలకు ముందే ప్రభాస్ (Prabhas) రికార్డును బ్రేక్ చేశాడు బాలీవుడ్ బాద్ షా. టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో సలార్‌కు 254K ఇంప్రెషన్స్ రాగా..దీన్ని బీట్ చేస్తూ జవాన్‌కు 258K ఇంప్రెషన్స్ వచ్చాయి. మరి రిలీజయ్యాక ఈ రెండు సినిమాల కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న జవాన్‌లో నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవనుంది. ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కిస్తోంది.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ రెండు పార్టులుగా రానుంది. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సలార్ Salaar Part-1 Ceasefire టీజర్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సలార్ పార్ట్-1ను 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. సలార్ పార్టు 1 విడుదల తర్వాత సలార్ పార్ట్-2 ఎప్పుడు రాబోతుందనే దానిపై క్లారిటీ రానుంది.
Jawan
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..
Jawan Prevue..
సలార్ టీజర్..