Dunki Movie | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). పఠాన్ (Pathaan), ‘జవాన్’ (Jawan) సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు. జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. రీసెంట్గా విడుదలైన ‘జవాన్’ (Jawan) సినిమా విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.695 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డంకీ (DUNKI). ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి అయిన ఈ సినిమా ఇప్పటికే సగనికి పైగా షూటింగ్ కప్లీంట్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు షారుఖ్ ప్రకటించాడు. అట్లీ (Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.690 కోట్లు కొల్లగొట్టింది. ఈ సందర్భంగా ముంబయిలో ‘జవాన్’ సక్సెస్ వేడుకలు జరిగాయి. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. డంకీ గురించి కుండ బద్దలు కొట్టేశాడు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
BREAKING: Shah Rukh Khan confirms #Dunki for 22nd December 2023 at Jawan event.
Third ₹1000 cr club movie is on cards for Baadshah. pic.twitter.com/Icre7662GR
— Manobala Vijayabalan (@ManobalaV) September 15, 2023
మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్ (Munnabhai MBBS). త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK), వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తీసిన రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ (Tapsee) కథనాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్(Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.