బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన గ్యారేజీలో ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీలకు సంబంధించిన కార్లున్నాయి. ‘పఠాన్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న షారుఖ్‌ఖాన్ ప్రస్తుతం విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదికోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారును కొనుగోలు చేసినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు షారుఖ్‌ఖాన్.
ఈ సందర్భంగా కారు తాలూకు వీడియోను షేర్ చేశారు. ముంబయి వీధుల్లో షికారు చేస్తున్న ఈ కారును చూసిన అభిమానులు అత్యద్భుతంగా ఉందని..‘పఠాన్’ విజయాన్ని షారుఖ్‌ఖాన్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ‘పఠాన్’ సినిమా వేడుకలో షారుఖ్‌ఖాన్ ధరించిన ఓ లగ్జరీ బ్రాండ్ వాచ్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. దాని విలువ ఐదు కోట్లుగా ఉన్నట్లు తెలిసింది.